Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాదాలకు అడ్డాగా పెంజర్లలోని పీఎన్జీ కూడలి
- అధికారుల తీరుపై మండిపడుతున్న స్థానికులు
- సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు
- ఏర్పాటు చేయాలని డిమాండ్
అది నాలుగు రోడ్ల కూడలి. ఇరువైపులా ప్రహరీ గోడ నిర్మాణం. ఎటు నుంచి ఏ వాహనం వస్తుందో తెలియని దుస్థితి. దగ్గరకు వచ్చాక గానీ కనపడని వాహనాలు. అదమ రి స్తే అంతే సంగతులు ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. అట్లా అని ప్రమాదాలు జరుగుతలేవా అంటే పొరపాటే. అదృష్టం బాగుండో ఎట్లానో చిన్నచిన్న ప్రమాదాలతో బయటపడుతున్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలలో ఎవరికి ప్రాణాపాయం కలగలేదు గాని ఎంతోమంది ఆస్ప త్రి పాలయ్యారు. అధికారులు మాత్రం ప్రమాదాల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకో కుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రాణాలు పోతే గాని స్పందించరా అంటూ అక్కడి స్థాని కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలకు అడ్డాగా మారిన పెంజర్లలోని పీఎన్జీ కూడలిపై కథనం.
నవతెలంగాణ-కొత్తూరు
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామ సమీపంలో నాలుగు రోడ్ల కూడలి ఉంది. పెంజర్ల, కొత్తూరు, మాణిక్యమ్మగూడ, పీఎన్జీ పరిశ్రమ ఇలా నలువై పుల నుంచి చౌరస్తా ఇది. చౌరస్తాకు ఇరువైపులా భూ యజమానులు తమ పొలాలకు చేయేత్తు ప్రహరీ గోడ, ఫ్రీ కాస్ట్ బిల్లలను నిర్మించుకున్నారు. దీంతో అటు ఇటుగా వచ్చే వాహనాలు దగ్గరికి వచ్చాక గాని కనపడని పరిస్థితి ఉంది. మాణిక్యమ్మగూడా, పీఎన్జీ పరిశ్రమ నుంచి వచ్చే వాహనాలు కొత్తూర్ వైపు వెళ్లే వాహనదారులకు దగ్గరికి వచ్చాక గాని కనిపించవు. ఒకవైపు పీఎన్జీ పరిశ్రమ మరొక వైపు కొత్తూరు మండల కేంద్రం ఉండడంతో నిత్యం ఈ రోడ్డు రద్దీగా ఉంటుంది. డబుల్ రోడ్డు కావడంతో వాహనదారులు చాలా స్పీడ్‌గా వెళ్తుంటారు. దీంతో తరుచు గా ప్రమాదాలు చోటుచేసకుంటున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి ప్రాణాపాయం జరగకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి
పెంజర్ల సమీపంలోని పీఎన్జీ పరిశ్రమ కూడలి ప్రమాదాలకు అడ్డాగా మారింది. అక్కడి భూ యజమాను లు తమ పొలాలకు ఇరువైపులా ప్రహరీ గోడ నిర్మాణం, ఫ్రీ కాస్ట్ బిల్లలను ఏర్పాటు చేసుకున్నారు. ఎటు నుంచి ఎవరు వచ్చారో దగ్గరకు వచ్చాక గాని కనిపించదు. తరచుగా ప్రమాదాలు జరుగుతున్న అధికా రులు ఎవరూ ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రాణాలు పోతే గాని చర్యలు తీసుకోరా..? అధికారుల తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం.
- రవీందర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు కొత్తూరు.
దగ్గరకు వచ్చేదాక ఏమి కనిపిస్తాలే..
నాలుగు రోడ్ల కూడలిలో ఇరువైపులా ప్రహరీ నిర్మాణం చేపట్టడంతో దగ్గరకు వచ్చాక గాని ఏమి కనిపించడం లేదు. నా పొలం నుండి ఇంటికి వచ్చే సమయంలో అక్కడ ప్రమాదానికి గురై ఆస్పత్రి పాలయ్యాను. తరచుగా అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా అధికారులు ఎవరూ ఇటువైపు చూడరు. వెంటనే సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి, ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి.
- దేశాల భీమయ్య, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ షాద్‌నగర్