Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ ఉమారాణి గోపాల్‌రెడ్డి
నవతెలంగాణ-మర్పల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యాక్రమంలో ప్రజలందరూ సద్వినియోగించుకోవాలని సర్పంచ్ ఉమారాణి గోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మర్పల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో కంటి వెలుగులో పాల్గొన్న ప్రజలకు వైద్యులు కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి కండ్ల అద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజల కంటిచూపు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామాల్లో చేపడుతోందన్నారు. కంటి చూపు సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో కంటి పరీక్షలు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ యాదయ్య, వార్డు మెంబర్ వెంకట్‌రెడ్డి, అలీముద్దీన్, గ్రామ ప్రెసిడెంట్ కాజాపాషా, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.