Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ నవనీత సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
కంటి వెలుగు పథకం దేశానికే ఆదర్శమని సర్పంచ్ నవనీత సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం బషీరాబాద్ మండలంలోని జీవన్గి గ్రామపంచాయతీలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకం బడుగు బలహీన వర్గాల ప్రజలకు భరోసా కల్పిస్తుందన్నారు. ప్రజలందరూ కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమ ంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాణిక్ రెడ్డి, మునీందర్ రెడ్డి, మల్లప్ప సౌకారి, ఆయుష్ వైద్యులు డాక్టర్ సురేష్, పీఎంఓ కార్తీక్ కంప్యూటర్ ఆపరేటర్ హరీశ్వర్ రెడ్డి, ఏఎన్ఎంలు రాజేశ్వరి, రాజలక్ష్మి, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.