Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి మున్సిపల్ చైర్మన్ రాంపాల్నాయక్, వైస్ చైర్మెన్ భీమనపల్లి దుర్గయ్య తది తరులు సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో ఉన్న విఠాయిపల్లిలో రూ.60 లక్షలు, 11వ వార్డులో ఉన్న ఆదర్శనగర్ కాలనీలో రూ.70 లక్షలు, 14వ వార్డులో ఉన్న ప్రేమ్ నగర్ కాలనీలో రూ.40 లక్షలు, 15వ వార్డు పరిధిలో ఉన్న ఉదరు నగర్ కాలనీలో రూ.60 లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించినట్టు వారు పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సుజాత రాములు, బైకని యాదమ్మ శ్రీశైలం యాదవ్, చెన్నకేశవులు, చెక్కల లక్ష్మణ్, గోరటి జ్యోతి నర్సింహ, విజయ్ కృష్ణ, విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.