Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు. కందుకూరు మండలం నేదునూరు గ్రామంలో శుక్రవారం ఆ గ్రామ సర్పంచ్ కాసుల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మారుమూల గ్రామాల పేద ప్రజల వద్దకే కంటి వైద్యులు వచ్చి, కండ్లను పరిశీలించి, కండ్ల అద్దాలు, మందులు అందజేస్తున్నారని తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సహకారంతో మండలంలో అభివృద్ధి పనులు కొనసాగించడం జరుగుతుందన్నారు.