Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీడీపీవో శాంతిశ్రీ ఆరుట్లలో పోషణ పక్షం కార్యక్రమం
నవతెలంగాణ-మంచాల
గర్భిణులు , బాలింతలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని సీడీపీవో శాంతిశ్రీ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఆరుట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. అంనతరం ఆమె మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు తగిన మోతాదులో సరైన ఆహారం తీసుకోవాలన్నారు.అంతేకాకుండా వ్యాయామం, విశ్రాంతి చాలా అవసరమన్నారు. రక్తహీనతకు లోనుకాకుండా ఐరన్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ ప్రసాద్, సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీటీసీ కావాలి శ్రీనివాస్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు,హెల్త్ సూపర్ వైజర్లు, అంగన్వాడీలు టీచర్లు, ఆశావర్కర్లు, గ్రామస్తులు ఉన్నారు.