Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శంకర్పల్లి మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్
నవతెలంగాణ-శంకర్పల్లి
ఏప్రిల్ 3నుంచి 13వ తేదీ వరకు పదోవ తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయని శంకర్పల్లి మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ అక్బర్ తెలిపారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు పరీక్ష రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు తెలిపారు. మండలంలో 1130 మంది పది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. మండలంలో ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. జిల్లా పరిషత్ బాలుర పరీక్ష కేంద్రంలో 200 మంది విద్యార్థులు, జిల్లా పరిషత్ బాలికల పరీక్ష కేంద్రంలో 200 మంది విద్యార్థులు, తెలంగాణ మోడల్ స్కూల్ ఏ సెక్షన్లో 190 మంది విద్యార్థులు, బి సెక్షన్లో 190 మంది విద్యార్థులు, రేవతి హై స్కూల్ పరీక్షా కేంద్రంలో 150 మంది విద్యార్థులు, రామకృష్ణ విద్యాలయ పరీక్షా కేంద్రంలో 200మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్టు తెలిపారు.ఆరుగురు సూపరిం టెండెంట్ అధికారులు, ఆరుగురు డిపార్ట్మెంట్ అధికారులు ఉంటారని తెలిపారు.ఈ పరీక్షా కేంద్రాల్లో విద్యుత్, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలు రాసే సెంటర్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎంఈఓ తెలిపారు. పరీక్షలు రాసిన సమయంలో జిరాక్స్ సెంటర్లను కూడా మూసి వేయించడం జరుగుతుందని తెలిపారు. గతంలో 11 పరీక్షలను ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఆరు పరీక్షలకు కుదించినట్టు తెలిపారు.