Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కమిషనర్ బి. శరత్చంద్ర
- వికారాబాద్ మున్సిపల్ స్వచ్ఛత మాషల్ మార్చ్ ర్యాలీ
- పరిసరాల పరిశుభ్రత పచ్చదనంపై యువకులతో ప్రతిజ్ఞ
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని మున్సిపల్ కమిషనర్ బి. శరత్చంద్ర అన్నారు. వికారాబాద్ మున్సిపల్ వార్డు నెంబర్ 19, 28ల్లో 'స్వచ్ఛత మషాల్ మార్చ్' ర్యాలీలలో వార్డు కౌన్సిలర్ స్వాతి రాజ్కుమార్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిష నర్ మాట్లాడుతూ పట్టణంలో ప్రజలందరూ తమ వ్యక్తిగత శుభ్రతతో పాటు, చుట్టు పరిసరాల ప్రరిశుభ్రతకు ప్రాధాన్య తనివ్వాలన్నారు. పచ్చదనం పెంపొందించి, భవిష్యత్ తరాలకు మంచి మార్గం చూపాలని కోరారు. రిసోర్స్ పర్సన్లు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువజన సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొ న్నారు. కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువజన సంఘాల సభ్యులతో స్వచ్చతపై, పరిసరాలను శుభ్రత, రోడ్లు, వీధులలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయవద్దని అవగాహన కల్పించారు. ఎస్ హెచ్జీ గ్రూప్ సభ్యులకు 3 బీన్ వ్యర్థాలు వేరు చేసి, ఇంటి లో కంపోస్టింగ్ను అమలు చేయిస్తామని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తామన్నారు. గుడ్డ సంచులు మాత్రమే ఉపయోగిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.