Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప తహసీల్దార్ విజయేందర్
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
దోమ మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా గ్రామస్తులకు పౌర హక్కులపై అవగాహన కల్పించినట్టు ఉప తహసీల్దార్ విజయేందర్ తెలిపారు. శుక్రవారం ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని పౌరులందరూ అన్నదమ్ముల వలే, కలసి మెలసి ఉండాలని, చిన్నచిన్న తగాదాలతో పోలీస్ కేసుల వరకు వెళ్లొద్దన్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం గురించి, సాంఘిక సంక్షేమ శాఖ నుంచి ఇస్తున్న రాయితీలు, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శాంతకొండ రెడ్డి, ఎంపీటీసీ నవాజ్ రెడ్డి, వార్డెన్ శంకర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజేష్, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.