Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ఐ దశరథ్,వార్డెన్ తుల్జారాంగౌడ్
నవతెలంగాణ-మర్పల్లి
కుల వివక్షత చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ దశరథ్, బాలికల హాస్టల్ వార్డెన్ తుల్జారామ్గౌడ్, సర్పంచ్ ప్రభాకర్ అన్నారు. మండలంలోని కొత్లపురం గ్రామంలో శుక్రవారం సర్పంచ్ ప్రభాకర్ అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవం జరుపు కున్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరూ కుల మతాలకతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలన్నారు. రాజ్యాంగం కల్పించిన చట్టాల హక్కులపై ఉండాలన్నారు. ఒకరి వ్యక్తిగత హక్కులపై మరొకరు మానసిక ఒక్తుడులకు గురి చేస్తే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 18 ఏండ్లలోపు ఉన్న వారికి బాల్యవివాహాలు జరిపించినా, బడీడు పిల్లలను బాల కార్మికులుగా పనిలో పెట్టుకున్నా చట్టపరమైన చర్యలు తప్ప వని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి తబాసుం, వార్డు మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.