Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్ష, కార్యదర్శిలుగా జోగు దీపక్, మంకు వంశీ
నవతెలంగాణ-మంచాల
ప్రజానాట్యమండలి ఆరుట్ల గ్రామ కమిటీని గురువారం రాత్రి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు అనుపాటి గణేశ్ తెలిపారు. ఆ కమిటీలో అధ్యక్ష, కార్యదర్శులుగా జోగు దీపక్ కుమార్, మంకు వంశీ,ఉపాధ్యక్షులుగా మంకు మహేందర్, కొండి గారి లక్ష్మన్, సహాయ కార్యదర్శులు గా మంకు సురేష్, కొండిగారి మహేష్, సోషల్ మీడియా బాధ్యులుగా గాద పాక బాల్రాజ్, జోగు సుధాకర్, కోశాధికారిగా అనుపాటి యాదయ్య, కమిటీ సభ్యులుగా తిమ్మగల్ల శ్రీను, ఆలువాల నాగరాజు, చిమర్ల ఉదయ్, కొండిగారి శ్రీను, మొత్తం 15 మందితో ఈ కమిటీని నియమించినట్టు ఆయన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా నాట్యమండలి కళ కళ కోసం కాదనీ, కళ ప్రజల కోసం, ప్రగతి కోసం అనే నినాదంతో అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి తన గళం విప్పుతోందన్నారు. ఆటపాటలతో ప్రజలను చైతన్యవంతులను చేయడంలో కీలక పాత్ర పోషిస్తుం దన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి కార్యవర్గ సభ్యులు బడ్డు విజయ్, జిల్లా కమిటీ సభ్యులు జోగు శేఖర్, తదితరులు పాల్గొన్నారు.