Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి
నవతెలంగాణ-కుల్కచర్ల
రైతన్నల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కుల్కచర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతులకు అధిక మొత్తంలో రుణాలు పంపిణీ చేశామన్నారు. నాబార్డ్ నిధులు రూ.2.76 కోట్లతో 2500 మెట్రిక్ టన్నుల, 100 మెట్రిక్ టన్నుల గోదాములతోపాటు రైస్ మిల్లు కూడా ఏర్పాటు జరుగుతుందన్నారు. రైతులు గతంలో తీసుకున్న రుణాలను చెల్లించి సంఘం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనంతరం సహకార సంఘం సభ్యత్వం కలిగిన రైతులను ప్రోత్సహించేందుకు గడియారాలు పంపిణీ చేశారు.ఈ కార్య క్రమంలో సర్పంచ్ సౌమ్య వెంకట రామిరెడ్డి, ఎంపీపీ సత్యమ్మహరిశ్చందర్, జెడ్పీటీసీ రాందాస్,పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, పాలకవర్గం సభ్యులు, సీఈవో బక్కారెడ్డి , బీఆర్ఎస్ చౌడపూర్ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు రాంలాల్ ,నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.