Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రంగారెడ్డి
- కార్యదర్శి చంద్రమోహన్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రవాణా రంగంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్య లను వెంటనే పరిష్కరించాలని రవాణా రంగ కార్మికుల వ్యతిరేకంగా మోడీ అవలంభిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, తెలంగాణ పబ్లిక్ ప్రయివేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి రుద్రకుమార్ అన్నారు. శనివారం అత్తాపూర్‌లోని ఉప్పరపల్లి చౌరస్తాలో 'రవాణా రంగాన్ని రక్షించుకుందాం, 2019 రవాణా చట్టాన్ని సవరించాలి' అని రోడ్డుపై రాస్తారోకో, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రవాణా రంగంపై కేంద్రం అవలంభి స్తున్న విధానాల వలన కార్మికులు అనేక సమస్యలు ఎదు ర్కొంటున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరుతున్నట్లు వ్యవహరిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రజా రావణ వాహనాలకు డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం నుండి మినహాయింపు ఇవ్వాలన్నారు. టోల్ టాక్స్ పెంపు ప్రతిపాదన విరమించుకోవాలన్నారు. టోల్ పెంపు ప్రజలపై అదనపు భారం పడుతూ ఉందని రవాణా నిత్యవసర ధరలపై ప్రభావం చూపుతుందని, మోటార్ వాహన చట్టం 2019 సవరించాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి టోల్ గేట్ల చార్జీలను పెంచిందన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 5న చలో ఢిల్లీ ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎండి చాంద్‌పాషా, హతిరాంనాయక్, రాము లునాయక్, బాబునాయక్, పాండు నాయక్, శివరాంనా యక్, వీరియానాయక్, సతీష్‌నాయక్, రాజునాయక్, రహీం, జాంగిర్, తదితరులు పాల్గొన్నారు.