Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కయాంజల్
కోహెడలోనిపండ్ల మార్కెట్‌ను శాశ్వత నిర్మాణం చేపట్టి హమాలీలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి శనివారం వినతిప త్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం. చంద్రమోహన్, హమాలీ యూనియ న్ అధ్యక్షులు ఎం.వీరయ్య మాట్లాడుతూ కొత్తపేటలో ఉన్న పండ్ల మార్కెట్ తరలింపు సమస్యను గందరగోళా నికి అవకాశాలు లేకుండా కోహెడలోనే వెంటనే పక్కా నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. అక్కడి హమాలీలకు, గూడ్స్ డ్రైవర్లకు డబుల్ బెడ్రూంలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో కార్మికులు గందరగోళానికి గురి అవుతున్నారని అన్నారు. తాత్కాలికంగా బాటసింగా రంలోకి తరలించినా కొహెడలో ఆధునిక మార్కెట్‌ను నిర్మిస్తామని తెలిపిన ప్రభుత్వం కమీషన్ ఏజెంట్లకు తలొగ్గి మళ్లీ కొత్త వివాదానికి తెరలేపడం కార్మికులకు తీవ్ర నష్టమని అన్నారు. హమాలీలకు కూలీ రేట్లు పెంచాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని, మార్కెట్‌ను నమ్ముకొని ఉన్న మినీ గూడ్స్ డ్రైవర్లకు పార్కింగ్ సౌకర్యం కల్పించి లైసెన్సులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. హమాలీ లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని వారు కోరారు.