Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ ప్రతినిధి జైపాల్‌రెడ్డి
- కాంటినెటల్ వైద్య నిపుణులతో అవగాహనా సదస్సు
- రెడ్డి సంఘం అధ్వర్యంలో ఏర్పాటు
నవతెలంగాణ-గండిపేట్
గుండె సమస్యలను పూర్తిగా అధిగమించేందుకు సీపీఆర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలని టీపీసీసీ ప్రతినిధి, రాజేంద్రనగర్ నియోజకవర్గ నాయకులు ముంగి జైపాల్‌రెడ్డి అన్నారు. శనివారం నార్సింగి మున్సిపల్ కోకాపేట్‌లోని రెడ్డి సంఘం కార్యాలయంలో కాంటినెటల్ వైద్య నిపుణులతో సీపీఆర్‌పై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఈ మధ్య చాలా మంది గుండెపోట్లతో చనిపోతు న్నారని అన్నారు. సీపీఆర్‌పై అవగాహన ఉంటే కొన్ని ప్రాణాలను అయినా కాపాడొచ్చని అన్నారు. గుండె సమస్యలపై అవగాహన చేసుకోవాలలన్నారు. సీపీఆర్‌పై అవగాహన కల్పించిన డాక్టర్లను రెడ్డి సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దుర్గేష్‌యాదవ్, విజరు, కాంటినెటల్ ఎమర్జెన్సీ డాక్టర్ అరుణ్, రెడ్డి సంఘం సభ్యులు ప్రకాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.