Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలి
- అధికారులను ఆదేశించిన జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పోషణ లోపంతో బాధపడు తున్న వారిని గుర్తించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పోషణ్ పక్వాడా కార్యక్రమం అమలు చేస్తోందని ఆయన తెలిపారు. శని వారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కన్వర్జెన్సి సమావేశానికి అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. జిల్లా మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పోషణ్ పక్వాడా కార్యక్రమం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మార్చి 20 నుంచి ఏప్రిల్ 3 వరకు పోషణ పక్వాడా పేరుతో వారోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నదని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోషణ్ పక్షోత్సవాల్లో భాగంగా తల్లులు, గర్భిణులు, చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. పోషణ పక్షోత్సవాలు జిల్లాలో విజయవంతం చేసేందుకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో కృ షి చేయాలని సూచించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఆహార నియమాలు అవలంభించే విధంగా అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచిం చారు. ఇందుకోసం (మిల్లెట్స్) సామలు, కొర్రలు, అరికెలు, జొన్న, సజ్జ, రాగి తదితర పోషకాలు కలిగిన ఆహారంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలి చ్చినందున, పక్షం రోజులపాటు ఈ కార్యక్రమాలు ఏర్పా టు చేస్తున్నారని తెలిపారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్నారు. చిరుధాన్యాల వినియోగంపై కొంగరక లాన్ అంగన్వాడీ కేంద్రానికి చెందిన చిన్నారులు ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా పోషణ పక్షం పోస్టరును అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ విడుదల చేశారు. ఈ సమావేశంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి మోతి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ప్రభాకర్, మెప్మా పీడీ అహ్మద్ సఫిఉల్లా, సీడీపీఓలు, సూపర్వైజర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.