Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాజేంద్రనగర్
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 18వ అకడమిక్ కౌన్సిల్ సమావేశం రాజేంద్రనగర్‌లోని వర్సిటీ ఆడిటోరి యంలో ఇన్చార్జి ఉపకులపతి ఎం. రఘునందన్ రావు అధ్యక్షతన జరిగింది. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్. సుధీర్‌కుమార్, ఫ్యాకల్టీ డీన్స్, అకడమిక్ కౌన్సిల్ సభ్యులు 19 అంశాలపై సుమారు నాలుగు గంటలు చర్చించారు. సంగారెడ్డి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కళాశాలలో సాయిల్, వాటర్ కన్జర్వేషన్ ఇంజనిరింగ్లో, పీహెచ్డీ కోర్స్‌ని, ఫార్మ్ మిషనరీ అండ్ పవర్ ఇంజనీరింగ్, ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్‌లో పీజీ కోర్సుల్ని ప్రారంభించడానికి అకడమిక్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా 2023- 24 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల సీట్లను 210కి పెంచుతూ కౌన్సిల్ తీర్మానించిం ది. పీహెచ్డీ కోర్స్ సీట్లని 61గా కౌన్సిల్ నిర్ధారించింది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో రీ వాల్యుయేషన్‌కి విధి విధానాలు రూపొందించడానికి కౌన్సిల్ అంగీకరించింది. 2023-24 విద్యా సంవత్సరంలో బీఎస్సీ (హనర్స్) అగ్రికల్చర్ కోర్సులో 955 సీట్లు, బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్)లో 87 సీట్లు, బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) 77 సీట్లు, బీఎస్సీ (హనర్స్) కమ్యూనిటీ సైన్స్‌లో 121 సీట్లు భర్తీకి కౌన్సిల్ ఆమోదించింది. 60 సీట్లతో ఈ ఏడాది అదిలాబాద్‌లో కొత్త వ్యవసాయ కళాశాలని ప్రారంభిం చడానికి అకాడమిక్ కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది. వరంగల్, అశ్వారా వుపేట వ్యవసాయ కళాశాలల్లో బీఎస్సీ కోర్సులో అత్యధిక ఓజీపీఎస్ సాధిం చిన వారికి ''గ్రోమోర్'' బంగారు పాతకాల్ని ఇవ్వడానికి కౌన్సిల్ పచ్చజెం డా ఊపింది. డిప్లమా కోర్సుల్లో 760 సీట్లకి ఆమోదం తెలిపింది. అనేక పరిపా లనా పరమైన అంశాలపై కూడా చర్చించి కౌన్సిల్ ఆమోదం పొందింది.