Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా, మండల స్థాయిలో వాట్సాప్ గ్రూప్స్
- వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి
- అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
రెండు మాసాల్లో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రో డ్ల పనులు పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లను జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో పంచాయత్ రాజ్, ఆర్అండ్బీరోడ్ల పనులపై అదనపు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి కాంట్రాక్టర్లు, ఎంపీ డీవోలు, డీఈ, ఏఈలతో సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికే మంజూరైన రోడ్ల పనులను వచ్చేవారం నుండి తప్పనిసరిగా మొదలుపెట్టాలని అన్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయం, అంకితభావంతో పనిచేసి నిర్ణీత సమయంలో పనులు పూర్తయ్యేలా కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా సీడీపీ, ఎస్డిఎఫ్, ఎంపీ లాడ్స్, సిబిఎఫ్ నిధులతో చేపట్టిన పనులను ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ సూ చించారు. మండలాల వారీగా పెండింగ్ పనులు జాబితా లను తీసుకొని పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులకు మొదటి ప్రాధాన్యత నిస్తూ నిర్దేశించిన సమయంలోపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా, మండల స్థాయిలో వాట్సాప్ గ్రూప్స్
జిల్లా, మండల స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసేందుకు వీలుగా వాట్సాప్ గ్రూప్ లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ ఈఈలతోపాటు ఎంపీడీవోలను ఆదేశించారు. జిల్లా గ్రూపులో కలెక్టర్, అదనపు కలెక్టర్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లను చేర్చాలని అదేవిధంగా మండల స్థాయిలో ఎంపీడీవోలు, కాంట్రాక్టర్లు, తహసీ ల్దార్లు, ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు ఉండేలా చూడాలని కలెక్టర్ సూచించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన సమయంలోపు ప నులు పూర్తయ్యేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ లాల్‌సింగ్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి నిరంజన్ రావు పాల్గొన్నారు.