Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో దాదాపు కోటి రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను శనివారం కౌన్సిలర్ సుండూరి ఝాన్సీ శేఖర్ తో కలిసి మున్సిపల్ చైర్మెన్ నేనావత్ రాంపాల్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఝాన్సీ శేఖర్ మాట్లాడుతూ బొడ్రాయి నుంచి మాడుగుల రోడ్డు వరకు రూ 60 లక్షలు, దర్గా నుంచి బుక్క మున్న ఇంటి వరకు రూ.20 లక్షలు, మహేశ్వరం శ్రీను ఇంటి నుంచి అశోక్ ఇంటి వరకు రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ భీమనపల్లి దుర్గయ్య, కౌన్సిలర్లు గోరటి జ్యోతి నర్సింహ, బైకని యాదమ్మ శ్రీశైలం యాదవ్, కృష్ణ యాదవ్, చెన్నకేశవులు, శ్రీకాంత్ సింగ్, జానయ్య, యాదయ్య, మల్లయ్య, శ్రీనివాస్, బాలు, కర్నాటి సురేష్, హరినాథ్, నర్సిరెడ్డి, గిరి యాదవ్, కేకే శ్రీను, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.