Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్షర ఉన్నత పాఠశాలలో వీడ్కోలు సమావేశం
నవతెలంగాణ-తలకొండపల్లి
విద్యార్థులు ఇష్టంగా చదువుకుంటేనే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని సర్పంచ్ లలిత జ్యోతయ్య అన్నారు. శనివారం తలకొండపల్లి మండల కేంద్రంలో అక్షర ఉన్నత పాఠశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ గురువులకు, తల్లిదండ్రులకు గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలుపుకోవాలనీ, తమకు తాము మోటివేట్ చేసుకోవాలని, ప్రశంసించుకోవాలన్నారు.పదోవ తరగతి పరీక్షలకు బాగా ప్రిపేర్ అవ్వాలని, పరీక్షలు ముగించే వరకు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను, ఆటలు పాటలు డ్యాన్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడ్వై జర్ దోమ మోహన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ లలిత జ్యోతయ్య, కరస్పాండెంట్ శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీకాంత్ రెడ్డి, ఉపాధ్యాయులు సరిత, నసిమ్, స్వాతి, సురేష్, అశ్విని, సందీప్, దీప్తీ, విమల, భవాని, ఉమాదేవి, ధరణి, శ్రీశైలం, లవ ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.