Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్
- కడ్తాల్ టోల్ గేట్ వద్ద కాంగ్రెస్ నాయకుల ఆందోళన
- పేంచిన టోల్ గేట్ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్
నవతెలంగాణ-ఆమనగల్
అదానీ, అంబానీలకు దోచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం టోల్ గేట్ చార్జీలు పెంచి మరోసారి పేద మధ్యతరగతి వర్గాల నడ్డి విరిచిందని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి టోల్ గేట్ చార్జీలు పెంచినందుకు నిరసనగా శనివారం కడ్తాల్ టోల్ గేట్ సమీపంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ హాజరె,ౖ మాట్లాడుతూ నిత్యం పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మధ్య తరగతి ప్రజల నడ్డి విరిగే విధంగా టోల్ గేట్ రుసుమును 5 నుంచి 10 శాతానికి పెంచడం సరికాదన్నారు. రవాణా రంగంపై పగపట్టిన విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ప్రభుత్వ, ప్రయివేట్ రవాణా రంగాలపై మోయలేని భారాన్ని వేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలపై అధిక భారమై కూర్చున్న ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నిరసన ఆందోళనలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు కొంతసేపు రాస్తా రోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి బీక్యానాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్, కడ్తాల్, తలకొండపల్లి మండలాల అధ్యక్షులు సబావట్ బిచ్యానాయక్, డోకూరి ప్రభాకర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ చేగూరి వెంకటేష్, కో-ఆప్షన్ సభ్యులు జహంగీర్ బాబా, సర్పంచ్‌లు శంకర్, పాండు నాయక్, రాము, తలకొండపల్లి, కడ్తాల్ మండలాల సేవాదళ్ అధ్యక్షులు కాన్గుల దశరథం, గురిగల్ల లక్ష్మయ్య, జిల్లా నాయకులు జవాహర్ లాల్ నాయక్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు కేతావత్ హీరాసింగ్ నాయక్, సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి, మలే మల్లేష్ గౌడ్, సత్యం యాదవ్, రామకృష్ణ ఆరిఫ్ అజీమ్ మల్లయ్య, రవీందర్, శ్రీను, షాబుద్దీన్, రమేష్, భాను కిరణ్, రాజేష్, ఇమ్రాన్ బాబా, రవి, తులసి రామ్, విజయరాథోడ్, రమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.