Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య
- మోడీ హటావో దేశ్ కో బచావో కార్యక్రమం
నవతెలంగాణ-చేవెళ్ల
'మోడీ హటావో దేశ్ కో బచావో' కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు జరిగే ఇంటింటికీ సీపీఐ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం చేవెళ్ల నియోజకవర్గం సమా వేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అవినీతి పెట్రేగిపోతున్నదన్నారు. గౌతమ్ ఆదాన్ని చేసినా కుంభకోణం మునుపెన్నడూ లేనివిధంగా ప్రజల సొమ్ము దోచుకున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలపై, దళిత గిరిజనులపైన మహిళలపై దాడులు హత్యలు, లైగింక దాడులు అధికమైయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశం అధోగతి పాలవుతున్నదని అందుకోసమే మోడీని గద్దె దించడం కోసం జరిగే దేశవ్యాపిత కార్యక్రమం 'మోడీ హటావో దేశం బచావో' కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని వ్యవసాయ రంగం నిర్వీర్యం చేసేందుకు యత్ని స్తున్నా యని తెలిపారు. అంతేకాకుండా పరిశ్రమలు కూడా దివాలా తీసి, భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవు తోందన్నారు.కానీ అంబానీ, ఆదానీలు మాత్రమే ధనికులను చేసిన మోడీ ప్రభుత్వాన్ని గద్దేదించడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ తరలిరావాలన్నారు. సీపీఐ ఇంటింటీ కార్యక్రమం ఏప్రిల్ 15న నవపేట్లో ప్రారం భమై మే 15న చేవెళ్లలో ముగింపు కార్యక్రమం నిర్వహి స్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని మొయి నాబాద్, షాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నియోజ కవర్గ కన్వీనర్ కె రామస్వామి, కో కన్వీనర్లు ఎం ప్రభు లింగం, గోపాల్ రెడ్డి, చేవెళ్ల మండల కార్యదర్శి ఎం. సత్తిరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్య నారాయణ, ఏఐకేఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సుధాకర్‌గౌడ్, జిల్లా ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడు సుభాన్‌రెడ్డి, శంకర్పల్లి కార్యదర్శి సుధీర్, మొయినాబాద్ మండల కార్యదర్శి కె.శ్రీనివాస్, చేవెళ్ల మండల సహాయ కార్యదర్శి ఎండీ. మక్బుల్, మండల సీనియర్ నాయకులు శౌరీలు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వడ్ల మంజుల, మాధవి, విజయమ్మ, మీనాక్షి, ఏఐటీయూసీ మండల ప్రధాన కార్యదర్శి శివయ్య, శ్రీను, రామచంద్రయ్య, బీకెఎంయూ మండల కార్యదర్శి మల్లేష్, ఉప సర్పంచ్ రఘురాం తదితరులు పాల్గొన్నారు.