Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందూత్వ ఏజెండాతో మతాల చిచ్చు
- ప్రజల ఖాతాలో రూ.15 లక్షలు ఎందుకు జమ చేయలేదు?
- రెండు కోట్ల ఉద్యోగాలు లేవీ?
- విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఎనిమిదేండ్లలో కార్పొరేట్లకు దోచిపెడుతూ, ప్రజలను మరింత పేద వాళ్లను చేస్తున్న ప్రధాన మంత్రిని గద్దె దించేందుకు ప్రజ లు సిద్ధమవుతున్నారనీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. శనివారం కందుకూరు మండల కేంద్రం సామ నరసింహరెడ్డి, కల్యాణ మండపంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షులు మన్నె జయేందర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జిల్లా చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలసి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూల విధానాల అవలంభిస్తూ, కార్మికులును, రైతులు, వ్యవసాయ కార్మికులను రోడ్డు పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ వారు అబద్దాలతో యువతను తప్పుదారి పట్టిస్తూ, కులమతాల చిచ్చుపెడుతూ, పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో ప్రధాని మంత్రి నిరుద్యోగులకు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీనిచ్చి, ఉన్న ఉద్యోగాలను తొలగి స్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ లను ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించి, ప్రజాధనాన్ని కొల్లగొడుతుందని విమర్శించారు. గత 75 ఏండ్ల నుంచి పరిరక్షిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు, బీఎస్ఎన్ఎల్, రైల్వే ,ఎయిర్పోర్ట్ట్, షిప్యాడ్, బొగ్గు గనులు, స్టీల్ ప్లాంట్లు, ఇద్దరు వ్యక్తుల కోసం అమ్మకానికి పెట్టారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ను ఎదుర్కోలేక ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాల నాయకులను తిప్పి కొట్టి, సీఎం కేసీఆర్ చేసే అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని కోరారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం స్థలాలు ఉన్నవారికి ప్రభుత్వం రూ.3 లక్షలు అంద జేస్తుందనీ, ఆ డబ్బులతో ఇండ్లు కట్టుకోవాలని కోరారు. ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను సర్పంచులు ఎంపీ టీసీలు నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. రాబోయే కాలంలో కందుకూరు మండలం ఒక హైటెక్ సిటీగా మారబోతుందన్నారు. ఇప్పటికే ప్రయివేట్ రంగాల్లో అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినట్టు తెలిపారు.బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. గ్రామస్థాయి నుంచి మండలం నియోజకవర్గం అభివృద్ధి పనులపై సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహే శ్వరం మార్కెటింగ్ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి, కందు కూరు సొసైటీ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, కందుకూరు సొసైటీ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి, నియోజకవర్గం ఉపాధ్యక్షులు లక్ష్మీనరసింహరెడ్డి, నూతనంగా ఎన్నికైన నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఆమెగౌని అంజయ్యగౌడ్, అయినవోలు శ్రీకాంత్ రెడ్డి, నాయకులు బేరాల బాలకిషన్, నాయకులు సామ మహేందర్ రెడ్డి, ఎస్సీ, సెల్ నియోజవర్గ నాయకులు ఉయ్యని సామయ్య, బీసీ సెల్ నాయకులు ఆనగ నూనె పాండుగౌడ్, డైరెక్టర్లు పొట్టి ఆనంద్, సాదా పాండురంగారెడ్డి, మైనార్టీ నాయకులు అల్లి, యువజన విభాగం నాయకులు మేఘనాథ్రెడ్డి, సర్పంచులు కాసుల రామకృష్ణారెడ్డి, రైతు సంఘం మండల నాయకులు సోలిపేట్ అమరేందర్ రెడ్డి, సర్పంచ్లు యాలాల శ్రీనివాస్, అనిత శ్రీనివాస్, సోమ్లా నాయక్, ఎంపీటీసీలు ఇందిరా దేవేందర్, సురేష్, రాజశేఖర్ రెడ్డి, యువజన విభాగం నాయకులు తాళ్ళ కార్తీక్, మాజీ ఎంపీటీసీ ఈశ్వర్ గౌడ్, విగేశ్వర్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్ రెడ్డి, పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.