Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ నాయకులు
నవతెలంగాణ-శంకర్పల్లి
'పల్లె పల్లెకూ సీపీఐ' కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని సీపీిఐ చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జి కన్వీనర్ కే. రామస్వామి, రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. ప్రభు లింగం పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేం ద్రంలో ఆర్అండ్బి గెస్ట్ హౌస్‌లో జరిగిన సీపీిఐ మండల కౌన్సిల్ సమావేశం మండల కార్యదర్శి పి.సుధీర్ అధ్యక్ష తన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ కేంద్రంలో రాష్ట్రంలో మోడీ కేసీఆర్ ఎన్నికలు ఇచ్చి న వాగ్దానాలు అమలు పరచడంలో వైఫల్యం చెందారన్నా రు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మతోన్మాదాన్ని, బడుగు, బలహీన వర్గాలపై దాడులు, ధరల పెంపును, గ్యాస్ ధరల ను పెట్రోల్ డీజిల్‌లను పెంచడానికి వారు తీవ్రంగా విమ ర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు డబుల్ బెడ్రూం ఇండ్లను 9 ఏండ్ల కాలంలో చేవెళ్ల నియోజకవర్గంలో ఎక్కడా ఇవ్వలేదని విమర్శించా రు. చేవెళ్ల మండల కేంద్రంలో 75 సర్వే నెంబర్లు 700 గుడి సెలను 45 రోజులుగా పోరాటం చేస్తున్న గుడిసె వాసులను ప్రజాప్రతినిధులు అధికారులు పరామర్శించిన పాపాన పోలేదన్నారు. తక్షణమే గుడిసె వాసులకు పట్టాలి ప్పించాలని కోరారు. ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా సీపీిఐ ఆధ్వర్యంలో 'పల్లె పల్లెకూ సీపీిఐ జాతా' కార్యక్రమం భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమ స్యలను పరిష్కరించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నాని చంద్రయ్య, మండల సీపీఐ కార్యదర్శి పి.సుధీర్, సహాయ కార్యదర్శి సయ్యద్ మోదిన్, సీపీిఐ సీనియర్ నాయకులు కే. రామస్వామి, పరమయ్యా, గంగయ్య, అంతయ్య, మల్లేష్, యాద య్య, శేఖర్, పోచయ్య, మహిళా సంఘం నాయకురాలు శంకర్పల్లి మండల గౌరవ అధ్య క్షులు అమతమ్మ, మహిళా సంఘం నాయకులు నూతన మండలాధ్యక్షురాలు లక్ష్మీభవాని, మహిళా సంఘం నాయకులు యాదమ్మ, మండలంలోని ప్రజాసంఘాలను నూతనకమిటీలు ఎన్నుకున్నారు.