Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా అధ్యక్షుడు పి.అంజయ్య
- సింగారంలో గెజిట్కు వ్యతిరేకంగా రైతుల నినాదాలు
- ఫార్మాకు భూములను ఇచ్చే ప్రసక్తే లేదు
నవతెలంగాణ-యాచారం
ఫార్మాసిటీకి కౌలు భూములను ప్రభుత్వం తీసుకోకుం డా ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని వ్యకాస జిల్లా అధ్య క్షుడు పి.అంజయ్య హెచ్చరించారు. శనివారం యాచారం మండల పరిధిలోని సింగారంలో ఓంకారేశ్వర ఆలయ భూ ముల కౌలు రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1400 ఎకరాల్లో 600 కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని గుర్తుచేశారు. అలాంటి భూముల ను ఫార్మాకు తీసుకుంటామని టీఎస్ఐఐసీ ఎలా గెజిటును విడుదల చేస్తారని మండిపడ్డారు. స్థానికంగా ఉన్న కౌలు రైతుల అభిప్రాయాలను తీసుకోకుండా అధికారులు ఏక పక్ష నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఆ భూ ములను ఫార్మాకు తీసుకోవడంతో కొన్ని వందల కుటుం బాలు రోడ్డున పడతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశా రు. ఆ గెజిటును అడ్డుకొని తీరుతామని రక్షిత కౌదారులు హెచ్చరించారు. ఈ గెజిట్కు వ్యతిరేకంగా మరో ఉద్యమా న్ని రైతులను కూడగట్టి లేవదీస్తామని ఆయన ప్రభుత్వానికి గుర్తు చేశారు. కౌల్దారు భూములను ఫార్మాకు తీసుకోవడం అనే నిర్ణయాన్ని అధికారులు వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ భూములను ఫార్మా కంపెనీకి ఇచ్చే ప్రసక్తే లే దని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సింగారం రై తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.