Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి పక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. షాద్ నగర్ మండలంలో బీఆరెస్ మండలాధ్యక్షులు లక్ష్మణ్ నా యక్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మే ళనానికి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ముఖ్యఅతిథిగా పా ల్గొని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నారని, తిప్పి కొ ట్టేందుకు నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులను ఉద్యోగాల విషయంలో తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ వ్యవ హారంలో ప్రభుత్వానిదే తప్పని ప్రచారం చేస్తున్నాయన్నా రు. వాస్తవాలను నిరుద్యోగులకు, ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యతను శ్రేణులు తీసుకోవాలన్నారు. ఏడాదికి కోటి ఉ ద్యోగాలు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఒక తొడుక్కునే కోటు కూడా ఇవ్వలేదంటూ ఎద్దేవా చేశారు. తప్పుడు ప్రచారా లను తిప్పి కొట్టాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకట్ రాంరెడ్డి, ఎంపీపీ ఖాజా ఇద్రిస్, వైస్ ఎంపీపీ మౌనిక హరికష్ణ గౌడ్, మార్కెట్ కమి టీ చైర్మన్ మన్నే కవిత నారాయణ యాదవ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరా జన్, ఎస్సిఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు రాంబల్ నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి, సింగల్ విండో చైర్మెన్ బకన్న యాదవ్, మాజీ జెడ్పీటీసీ సూర్య ప్ర కాష్, యాదవాచారి, గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు లక్ష్మి నరసింహ్మా రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజవర ప్రసాద్‌రావు, తాండ్ర వెంకట్ రెడ్డి, బాబు నాయక్, రాయి కల్ వెంకట్ రెడ్డి, సుష్మా రెడ్డి, గుర్రంపల్లి కృష్ణయ్య, జాం గారి రవి, బిశ్వ రామకృష్ణ , చిలక మర్రి రవీందర్ రెడ్డి, చక్కటి వెంకటేష్ యాదవ్, బాబు నాయక్, బాలు నాయక్, అశోక్ రెడ్డి, గణేష్ గౌడ్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.