Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జపాల్ గ్రామ కమిటీ కన్వీనర్ యాట పాండు
నవతెలంగాణ-మంచాల
జపాల్ గ్రామానికి జిల్లా స్థాయి జాతీ య అవార్డులు రావడం అభినందనీయం సీపీఐ(ఎం) గ్రామ కమిటీ కన్వీనర్ యాట పాండు అన్నారు. ఆదివారం మండల పరి ధిలోని జపాల్లో ఆయన మాట్లాడుతూ బాలల సేవా పూర్వక పంచాయతీ, ఆరోగ్య పంచాయతీ 2 విభాగాల్లో జిల్లా స్థాయి జాతీయ అవార్డు లు వచ్చాయన్నారు. ఈ అవార్డులు రావడానికి అహర్నిశలు కృషి చేసిన సర్పంచ్ సయ్యద్ నహీధ్ రవుఫ్, ఎంపీటీసీ లట్టుపల్లి చంద్రశేఖర్ రెడ్డి, ఉపసర్పంచ్ బకున మల్లప్ప, పంచాయతీ కార్యదర్శి రాజ్‌కుమార్, వార్డు సభ్యులకు అభి నందనలు తెలిపారు. గ్రామంలో మంకి పుడ్ కోర్టు ఏర్పాటు, రూట్టాక్ వాటర్ హాల్ ఎస్తింగ్ స్తక్చర్ నిర్మాణం, కరోనా సమయంలో రాష్ట్రంలోనే మొదట లాక్ డౌన్పెట్టిన గ్రామం అని, శ్మశాన వాటిక నిర్మాణం, పల్లె ప్రకృతి వనం, కంపోస్టు యార్డు, క్రీడా ప్రాంగణం, సామూహిక శ్మశాన వాటిక, బృహత్ పల్లె ప్రకృతి వనం లాంటి పనుల్లోచురుకుగా త్వర గా పనులు పూర్తిచేస్తామన్నారు. కార్య క్రమంలో మండల కమిటీ సభ్యులు అన్నారం లెనిన్, స య్యద్ హాఫిజ్ పాషా, పార్టీశాఖ కార్యదర్శిలు యాట ము త్తయ్య, ఎల్.ప్రభాకర్, ఎచ్అంజ నేయు లు, ఎన్.హరికృష్ణ నాయకులు, నాయకులు పాపి రెడ్డి, యాట జగన్, నోము ల కృష్ణ, ఓరుగంటి భాస్కర్ తదితరులు ఉన్నారు.