Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు మాదగొని జంగయ్య గౌడ్
నవతెలంగాణ-మంచాల
రైతుల భూ రికార్డులను సరి చేసుకోవ డానికి ధరణి పోర్టల్లో ఆన్లైన్ ఓపెన్ చే యాలని వైఎస్ఆర్సీసీ రాష్ట్ర నాయకులు మాదగొని జంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల పరిధిలోని ఆరుట్లలో ఆయన మాట్లాడుతూ ధరణి పోర్టల్ కార్యక్రమంలో 5 ఏండ్లుల భూ రికార్డులు సరి చేసే కార్యక్రమంలో రెవిన్యూ అధికారు లు గ్రామాలకు వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారులతో, భూ బ్రోకర్లతో కుమ్మకై రైతులకు ఎలాంటి సమాచారమూ ఇవకుండా, నోటీస్లు ఇవ్వకుండా భూ రికార్డులు మొత్తం తారుమారు చేశారని, ఆన్లైన్ నుండి తొలగించారన్నారు. తారుమారై భూ రికార్డులు 5 ఏండ్లు గడి చినా భూ రికార్డులు మాత్రం సరి కావడం లేదన్నారు. రెవిన్యూ అధికారులను అడిగి తే ధరణి పోర్టల్లో ఎలాంటి అఫ్షన్ లేద నీ ఆన్లైన్లో రూ.1500 ఇచ్చి ధర ఖాస్తు చేసుకోవాలని చెబితే వేల మంది రైతులు ఆన్లైన్లో రూ.1500 చెల్లించి ఆన్లైన్ దరఖాస్తు చేసున్నారని, కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదన్నారు. చాల మంది రైతల భూ ములు రికార్డుల్లో లేక పోవడంతో వారికి రైతుబందు, రై తు బీమాలు రావడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పం దించి రైతుల భూ రికార్డులు సరి చేసుకోవడానికి ధరణి పోర్టల్లో అన్లైన్ ఓపెన్ చేసి భూ రికార్డులు సరి చే యా లన్నారు. లేనిచో రైతులను ఏకం చేసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.