Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి
నవతెలంగాణ-షాబాద్
మండలంలో ఉన్న ప్రతి పల్లెనూ అభివృద్ధి చేస్తామని షా బాద్ జడ్పీటీసీ పట్నం అవినాష్‌రెడ్డి అన్నారు. ఆది వారం మండల పరిధిలోని కేశవగూడ గ్రామంలో రూ.10 లక్షల హెచ్ఎండీఏ నిధులతో చేపట్టిన సీసీరోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడు తూ...రాష్ట్రంలో ప్రతి పల్లెనూ అభివృద్ధి పరిచేం దుకు సీఎం కేసీఆర్ కొత్త పంచాయతీలను ఏర్పా టు చేయగా, అప్పటి జిల్లా మంత్రి పట్నం మ హేందర్‌రెడ్డి చొరవతో కేశవగూడ పంచాయతీ ఏర్పడిందన్నారు. అనంతరం పంచాయతీలో మౌలిక సదుపాయాల కల్పన కోసం దశల వారి గా ఇప్పటి వరకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాద య్య, ఎంపీ గడ్డం రంజితేందర్డ్డ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితరెడ్డిల సహకారంతో కేశవగూ డకి రూ.70 లక్షల నిధులు విడుదల చేయించామని, ఇంక నూ మిగిలిపోయిన పనులకు నిధులు కేటాయిస్తామన్నా రు. కార్యక్రమంలో సర్పంచ్ కవితనర్సింహులు, ఎంపీటీసీ మధుసూదన్‌రెడ్డి, ఉపసర్పంచ్ అంజయ్య, మాజీ ఉపసర్పం చ్ ఒగ్గు రాజు, నాయకులు రాందేవాయాదవ్, ఒగ్గు మల్ల య్య, కృష్ణయ్య, కిష్టయ్య, వెంకటయ్య, వార్డు మెంబర్లు లక్ష్మమ్మ, పద్మమ్మ, ఇంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.