Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కాలే యాదయ్య
నవతెలంగాణ-చేవెళ్ల
వ్యాపార రంగాలను యువత ఎంచుకుని ఆర్థికంగా రాణించాలని ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. ఆదివా రం మండల పరిధిలోని కేసారం స్టేజీ వద్ద ఏ.వినోద్ కు మార్, బి.గౌతమ్ రెడ్డిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమో ఘం రెస్టారెంట్‌ను ఎమ్మెల్యే కాలే యాదయ్య, నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ..చదువుకున్న వారు ఖాళీగా ఉండకుండా చిన్నచిన్న వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా వ్యాపార రంగాలను ఎంచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందలన్నారు. వ్యాపారాల్లో రాణించి ఇతరులకు చేయుతనివ్వాలని సూ చించారు. నాణ్యతతో రుచికరమైన ఆహార పదార్థాలు కస్ట మర్లకు అందించాలని, వ్యాపార అభివృద్ధి చెంది ప్రజల మ నన్నలు పొందాలని నిర్వాహకులకు సూచించారు. అమో ఘం రెస్టారెంట్ దాబా ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు కొత్త రకమైన దాబా అందుబాటులో వచ్చినట్లు వివరిం చారు. నూతనంగా ఏర్పాటు చేసిన దాబాలో వంటకాలు చాలా రుచిగా ఉన్నాయని ఇదే తరహాలో కస్టమర్లకు అం దించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, వైస్ ఎంపీపీ శివప్రసాద్, కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గం సీనియర్ నాయకులు వసంతం, కేసారం గ్రామ సర్పంచ్ రమేష్ గౌడ్, చేవెళ్ల సర్పంచ్ బండారు శైలజాఆగిరెడ్డి, బల్వంత్ రెడ్డి, కార్తిక్ రెడ్డి, అంజిరెడ్డి, విక్రం రెడ్డి, నాయకులు రమణ రెడ్డి, కృష్ణా రెడ్డి గ్రామస్తులు ఉన్నారు.