Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిన్న నందిగామలో 'హాత్ సే హాత్ జోడో' యాత్ర
నవతెలంగాణ-కొడంగల్
రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ మండలాధ్యక్షులు నందారం ప్రశాంత్, టీపీసీసీ ప్రతినిధి ఎండీ యూసుఫ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణంరాజు, కొడంగల్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద్ రెడ్డిలు అన్నారు. కొడంగల్ మండలం చిన్న నందిగామలో కాంగ్రెస్ గ్రామాధ్యక్షులు దత్తుస్వామి, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు అబ్దులప్పలతో కలిసి మండల నాయకులు హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్ర జా సమస్యలను, అభివృద్ధిని ప్రభుత్వం గాలికి వది లేసిం దని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమ స్యలను పట్టించుకోకుండా సమస్యలపై మాట్లాడిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నార న్నారు. ప్రశ్నించే గొంతుకలను ఇబ్బందులకు గురి చేయడం ప్రజా స్వామ్యానికి విరుద్ధమన్నా రు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభు త్వాలపై ప్రజలు తిరుగుబాటు జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలం లో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. కార్య క్రమంలో కొడంగల్ పట్ట ణ వర్కింగ్ ప్రెసిడెంట్ దాము, బాలరాజు, కౌన్సిలర్ శంకర్ నాయక్, రుద్రారం సాయిలు, సోమశేఖర్, సర్పంచ్ బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.