Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
వికారాబాద్ పట్టణానికి వివిధ పనుల రీత్యా వచ్చే రైతులు, వినియోగదారులు, ప్రజల దాహం తీర్చడంలో భాగంగా వేసవికాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం అని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ వైస్ చైర్ పర్సన్, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. ఆదివారం శ్రీరామ సేవాసమితి, కృష్ణ పంతులు ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలోని రామ్ మందిర్ దగ్గర ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని చైర్ పర్సన్ మంజుల రమేష్ ప్రారంభించారు. కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, నాయకులు మొముల రాజ్ కుమార్, మాధవరెడ్డి, కెపి రాజు, సత్యనా రాయణ గౌడ్, రామ్ నివాస్ రాఠి, శ్రీరామ సేవాసమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.