Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆమనగల్
ఆమనగల్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళా శాల భవనం నిర్మాణ పనులను ఆదివారం ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ పరి శీలించారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి రా బోయే విద్యా సంవత్సరం ప్రారంభం వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశిం చారు. స్థానిక జడ్పీటీసీ సభ్యులు నేనావత్ అనురాధ పత్యనాయక్, రైతు సమ న్వయ కమిటీ మండలాధ్యక్షుడు నిట్ట నారాయణ తదితరులు నిత్యం భవనం నిర్మాణ పనులను పరిశీలించి త్వరితగతిన భవనం పూర్తి అయ్యేందుకు కృషి చే యాలని సూచించారు. అంతకు ముందు ఆయన ఆకుతోటపల్లిలో జరుగు తున్న బొడ్రాయి పండుగ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ రమేష్ నాయక్, యూత్ వింగ్ అధ్యక్షుడు వడ్డే వెంకటేష్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.