Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్‌రెడ్డి
నవతెలంగాణ-పరిగి
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం పరిగి మండల పరిధిలోని లక్నాపూర్ గ్రామంలో హాత్ సే హత్ జోడో కార్యక్రమం పార్టీ పరిగి మండల అధ్యక్షుడు భూమనగారి పరుశురాం రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ అమలు చేసినటువంటి కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టే పథకాలను ప్రజలకు వివరించారు. సందర్భంగా రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపీ రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్యేశంతో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హాత్ సే హత్ జోడో కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభి స్తుందని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం తో నిత్యవసర సరుకుల ధరలు కూడా భారిగా పెరిగాయని అన్నారు. దీనితో సామాన్యుడు ఏమి కొనలేని పరిస్థితిలో ఉన్నాడని అన్నారు. బీజేపీ దేశ సంపదను అంబానీ, ఆదానీ లకు దోచిపెడుతుందని మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థల న్నీటిని ఒక్కొక్కటిగా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ ఉన్న ఉద్యోగాలను తీసివేస్తున్నారని అన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పనల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యా యని విమర్శించారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో సొం త ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇస్తామన్నారు. ఏకకా లంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఈ కార్యక్ర మంలో జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, ఉపాధ్యక్షులు లాల్ కృష్ణ, దండు అశోక్, పట్టణ అధ్యక్షలు ఎర్రగడ్డ పల్లీ కృష్ణ, జిల్లా కార్యదర్శిలు ఆకారపు జగన్మోహన్ గుప్తా, మాధవరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కడుమూరు శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ అద్యక్షులు ఎరగడ్డపల్లీ జగన్, పట్టణ ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, పరిగి మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హేమలత, పరిగి మండల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు రత్నం,సెల్ అధ్యక్షులు తౌరియా నా యక్, యువజన కాంగ్రెస్ నాయకులు సాయిరెడ్డి, రాజు, మండల అధ్యక్షులు నాగావర్ధన్, ఎంపీటీసీ జహంగీర్, అనంత్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఆనందం, శ్రీశైలం, పార్టీ లక్మాపూర్ గ్రామ అధ్యక్షులు చాకలి వెంకటయ్య, ఉప సర్పంచ్ సందీప్‌రెడ్డి, గ్రామ ఎన్‌రోలర్ నాగరాజ్, మహేష్, నిఖిల్, రహీమ్ పటేల్, శ్రీను, లక్మాపూర్ గ్రామ నాయకులు అంజలయ్య, బి.నర్సింలు, సిహెచ్.శ్రీనివాస్, మహేష్ ప్రసాద్‌రెడ్డి, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.