Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డుపై నీరు వృథా పట్టించుకోని జలమండలి
నవతెలంగాణ-గండిపేట్
అసలే ఎండాకాలం.. గుక్కడు నీటి కోసం మహిళలు ఆరాట పడుతు న్నారు. గొంతు తడుపుకునేందుకు మహిళలు ఎదురు చూస్తున్నారు. నీటిని సక్రమంగా సరఫరా చేయడంలో జలమండలి అధికారులు, లైన్మెన్ల నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నార్సింగి మున్సిపాలిటీలో కొన్ని వార్డుల్లో పుష్క లంగా సరఫరా చేస్తూ కొన్ని బస్తీలకు నీటిని సరఫరా చేయకుండ నిర్లక్ష్యం వహిస్తున్నారు. నీళ్లు రాకపోవడంతో మహిళలు రోడ్డుపై లీకేజీ వద్ద పట్టుకు నేందుకు ఆరాట పడుతున్నారు. కానీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం జలమండలి అధికారులు మాత్రం నిత్యం సరఫరా చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అధికా రులు వారికి అనుకున్న కాలనీలో వార్డులకు అనుకున్న స్థాయిల్లో సరఫరా చేస్తున్నారు. పేదల బస్తీలకు వచ్చే వరకు సరఫరా చేయకుండ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు లీకేజీలకు మరమ్మతులు చేయించి ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.