Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐ అప్పయ్య
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
ధారూర్, కోట్పల్లి, బంట్వారం మండలాల్లోని పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీఐ అప్పయ్య తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద ఎక్కువ మంది గుమిగూడరాదన్నారు. దీంతో పాటు జిరాక్స్ కేంద్రాలను మధ్యాహ్నం ఒకటి గంటల వరకు మూసివేయాలని అన్నారు. కేంద్రాల లోపలికి విద్యార్థులకు, ఇన్విజిలేటర్లు, పరీక్ష పర్యవేక్షణ అధికారులకు మాత్రమే అనుమతి ఉంటుందని, గేటు మూసిన తరువాత లోపలికి వెళే అనుమతి ఇతరులకు ఉండదన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏదైనా అవాంచనీయ సంఘటనలు జరిగితే డయల్ 100 లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిసేంత వరకు అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు బంధువులు పరీక్షా కేంద్రాల వద్ద ఉండి విద్యార్థులకు ఏమైనా బయట నుండి అందించాలని ప్రయత్నం చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు. విద్యార్థులు ఏలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు.