Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతంలో తీగలు తలిగి రెండు పాడి గేదెలు మృత్యువాత
- పరిహారం అందక ఆందోళనలో రైతులు
- ఉపసర్పంచ్ కావలి జగన్
నవతెలంగాణ-యాచారం
గ్రామాల్లో కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగల ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించాలని ఉపసర్పంచ్ కావలి జగన్ డిమాండ్ చేశారు. సోమవారం యాచారం మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన గౌర పాపయ్య, కొంగళ్ల వెంకటయ్య వ్యవసాయ పొలంలో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నాయి. ఈ విషయాన్ని పలుమార్లు కరెంటు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కరెంటు తీగలు తగిలి పాడి గేదెలు మృత్యువాత పడ్డాయనీ తెలిపారు. ఆ ప్రమాదం జరిగి చాలా రోజులు గడుస్తున్నా, బాధితులకు నష్టపరిహారం అందలేదని తెలిపారు. మండలంలోని కరెంటు అధికారులు ఇలాంటి సమస్యలను గుర్తించి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత వారి పైన ఎంతైనా ఉందన్నారు. కొత్తపల్లిలో కిందకు వేలాడుతున్న కరెంటు తీగల సమస్యలు చాలా ఉన్నాయని వివరించారు. ఈ సమస్యను గుర్తించడంలో కరెంటు అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. ఇప్పటికైనా కరెంటు అధికారులు కిందకు వేలాడుతున్న కరెంటు తీగలనుంచి రైతులను కాపాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు గణేష్, పర్వతాలు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.