Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
శంకర్పల్లి మండలంలో పదోవ తరగతి పరీక్షలు ఏలాంటి అవంతరాలు లేకుండా ప్రశాంతంగా జరిగినట్టు విద్యాశాఖ అధికారి అక్బర్ తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకే విద్యార్థులను చెక్ చేసి, పరీక్ష హాల్లోకి పంపిం చారు. మండలంలో ఆరు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 1126 మంది విద్యార్థులకు గాను 1121 మంది విద్యార్థులు పరీక్షలకు హాజర య్యారు. ఐదుగురు విద్యార్థులు గైర్హజరైనట్టు ఆయన తెలిపారు. ఏదేమైనా మొదటి పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.