Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర కాలుష్య నియంత్ర మండలి
నవతెలంగాణ-కందుకూర్
ఎస్ఎస్ బ్యాటరీ రీ సైక్లింగ్ కంపెనీ మూసివేస్తామని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు గ్రామ స్తులకు హామీనిచ్చారు. కందుకూరు మండల అన్నోజిగూడ గ్రామ సర్పంచ్ కాకి ఇందిరా దశరథ ఆధ్వర్యంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్యాటరీ రీ సైక్లింగ్ వల్ల వచ్చే పొగ కాలుష్యం పక్కనే ఉన్న చెరువులోకి వెళ్లి, కలుషితమై చేపల మృత్యువాత పడుతు న్నాయని తెలిపారు. గ్రామానికి సరఫరా అయ్యే బోర్ చెరువులోనే ఉండటంతో ఈ నీరు కూడా కలుషితమ వుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న పాఠశాల విద్యార్థులకు, పొగ కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారనీ, రాత్రి వేళల్లో గ్రామంలో పొగ మొత్తం నిండిపోవడంతో గ్రామస్తులు ఊపిరి ఆడక ఆవస్థలు పడుతున్నారని తెలిపారు. దీంతో స్పందించిన రాష్ట్ర కాలుష్య మండలి బోర్డు అధికారులు తొందరలోనే ఈ బ్యాటరీ కంపెనీకి మూసి వేస్తామని హామీనిచ్చారు. గ్రామస్తులు బోర్డు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు ఎడ్ల కృష్ణ, గోదాస్ గణేష్, పుచ్చల మహేందర్, గోర్రెంకల రామకృష్ణ, కో -ఆప్షన్ మెంబర్లు జక్కుల మహేందర్, అందుగుల రాజు, కాకి పరమేష్, ఢిల్లీ సురేష్, జక్కుల శ్రీకాంత్ పాల్గొన్నారు.