Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీ చైర్పర్సన్ తీగెల అనితారెడ్డి
- అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ
నవతెలంగాణ-కందుకూరు
కందుకూరు మండలంలో వివిధ గ్రామాలకు జడ్పీ నిధుల నుంచి కోటి 39 లక్షల రూపాయలను మంజూరు చేయనున్నట్టు జడ్పీ చైర్పర్సన్ తీగెల అనితారెడ్డి అన్నారు. మంగళవారం కందుకూరు, కొత్తగూడ, అంగన్వాడీ కేంద్రాలను ఆమె ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనం తరం ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో విద్యా ర్థులు కూర్చోవడానికి బెంచీలు లేనందున రెండు అంగన్ వాడీ కేంద్రాలకు మ్యాట్లు పంపిణీ చేశారు. ఆర్ట్ ప్రొడ క్షన్స్ ట్రస్టు ద్వారా ఈ మ్యాట్లను పంపిణీ చేస్తామన్నారు. గూడూరు, కొత్తగూడ అంగన్వాడీ కేంద్రాల భవనాలకు నిధులు మంజూరు చేసి, నిధులు కేటాయించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మహేశ్వరం ప్రాజెక్టు సీడీపీఓ షబానా, కొత్తగూడ సర్పంచ్ సాదా మల్లారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, నాయకులు తాళ్ళ కార్తీక్, బొక్క దీక్షిత్ రెడ్డి, విగేశ్వర్రెడ్డి, బి. వెంకటేష్, జైపాల్‌రెడ్డి, మాజీ డైరెక్టర్ సామ ప్రకాష్‌రెడ్డి, అంగన్వాడీ సూపర్వైజర్లు అనసూయ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు గ్రామస్తులు పాల్గొన్నారు.