Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
- తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-చేవెళ్ల
జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు బండారు ఆగిరెడ్డి అన్నారు. మంగళ వారం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిని నగరంలోని ఆమె నివాసంలో రైతులతో కలిసి వారు కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో రైతుల నుంచి భూములు తీసుకున్న వారికి 2018 సంవత్సరం ప్రకారం కాకుండా ప్రభుత్వం ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం చెల్లించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం రైతులతో మరోమారు చర్చించి రైతులకు సరైన విధంగా భూపరిహారం అందించాలన్నారు. పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి విస్తరణలో చేవెళ్ల, మొయినాబాద్, పూడూర్ మండలాల పరిధిలోని వివిధ గ్రామాలోని రైతులు భూములు రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్నారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచు కుని రైతులకు న్యాయం చేయాలని కోరారు. మంత్రి స్పందిస్తూ , ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి రైతులకు న్యాయం చేసేలా కృషి చేస్తామన్నారు. మంత్రిని కలిసిన వారిలో రైతులు పాటి దామోదర్ రెడ్డి, భోజిరెడ్డి జుకన్నగారి శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రభు గుప్తా, బండారు మధుసూదన్ రెడ్డి, అల్లవాడ నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు.