Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిజిస్ట్రేషన్ ప్రకారం ఉంటే భూమి ఇవ్వాలి
- మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
- ప్రొఫెసర్ జి.గోపాల్ రెడ్డి
నవతెలంగాణ-శంషాబాద్
దగ్గరి బంధువులన్న నమ్మకంతో మధ్యవర్తులుగా ఉంచి భూమి కొనుగోలు చేస్తే వారే నట్టేట ముంచారని ప్రొఫెసర్ జి.గోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనను నమ్మించి నమ్మకద్రోహం చేసిన మేనమామ కొడుకు, అతని కొడుకుతో పాటు భూమి అమ్మిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రకారం భూమి ఇప్పించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కొడుకు జీ. కౌటిల్యతో కలిసి మంగళవారం శంషాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. శంషాబాద్ మండల పరిధిలోని పెద్ద గోల్కొండ రెవెన్యూలో సర్వే నంబర్ 94/5/ఎ ఎ/ఎ లో గడ్డమీది నర్సింహ, గడ్డమీది హరికృష్ణ, గడ్డమీది యాదగిరి(ఎంపీటీసీ), బాబుచందర్, డి.అనిత లకు చెం దిన మూడు ఎకరాల భూమిని తన మేనమామ కొడుకైన మల్ రెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అతని కొడుకు మల్రెడ్డి లోహిత్ రెడ్డిల మధ్యవర్తిత్వంతో 2018 డిసెంబర్ 31వ తేదీన కోనుగోలు చేశానని తెలిపారు. డాక్యుమెంట్ 133/ 2019 రిజిస్ట్రేషన్ అయ్యిందని తెలిపారు. తమ మేనమా మ కొడుకు ప్రభాకర్‌రెడ్డి, అతని కొడుకు లోహిత్‌రెడ్డి లను పూర్తిగా నమ్మడంతో పాటు వాళ్ల మీదనే భరోసా ఉంచుతూ భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నానన్నారు. ఈ 94 సర్వే నెంబర్ లో 60 ఎకరాలు ప్రయివేట్ వ్యక్తులకు మరో 60 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందన్నారు. సర్వే నెంబర్ ఒకటే కావడం బై నెంబర్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ భూమిని నిషేధిత జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్లు కాకుండా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ అయిన వాటికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా ఆపేసారని తెలిపారు. గడ్డమీది నర్సింహ అతని కుటుంబ సభ్యులకు కలిపి ఈ సర్వే నెంబర్ 94/5/ఎ ఎ/ఎలో 7-09 ఎకరాల భూమి ఉంద న్నారు. దాంట్లోంచి ఎ. కృష్ణారెడ్డికి విమల్‌కుమార్, పి.అ నురాధ, అనుష్కరాజ్, పి.రాజు, కె.ప్రభుకుమార్, కె. గీతావాణి అనే ఆరు మందికి ముందే అమ్మేశాడనీ అన్నారు. ఈ కొనుగోలుదారులు కొన్న భూమినీ మ్యుటేషన్ చేసుకోకపోవడం వలన రికార్డులో భూమి కట్ కాలేదు. ఇదే అదనుగా కుట్రపూరితంగా మేనమామ కొడుకు మ ల్‌రెడ్డి ప్రభాకర్ రెడ్డి, అతని కొడుకు లోహిత్ రెడ్డి అమ్మకం దారులతో కుమ్మక్కై లేని భూమిని తనకు అంటగట్టారని తెలిపారు. గడ్డమీది నర్సింహ అతని కుటుంబ సభ్యులు మూడు ఎకరాలు అమ్మితే టైటిల్ ప్రకారం ఒక ఎకరం 17 గుంటలు మాత్రమే ఉందన్నారు. అదనంగా ఎకరా 23 గుంటలు తనకు రిజిస్ట్రేషన్ చేశారని అన్నారు. తన మేనమామ కొడుకును నమ్మి డబ్బులు ఇస్తే వారు సొంత బంధువుని అని కూడా చూడకుండా మోసం చేశారన్నారు. ఈ విషయంపై సంబంధించిన భూమిపై ఈసీ ఇతర డాక్యుమెంట్లు తీసుకొని పరిశీలిస్తే వారి బాగోతం బయట పడ్డదని తెలిపారు. మూడు నెలలుగా వాళ్లతో పలుమార్లు పెద్దల సమక్షంలో చర్చలు జరిగాయని అన్నారు. అయినా వాళ్లు స్పందించకపోవడంతో పాటు తమను ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరింపులకు దిగారని ఆరోపించారు. తనకు రికార్డు ప్రకారం భూమి చూపిం చాలని అడిగితే తన కొడుకును చంపేస్తామని వాట్సాప్‌లో మెసేజ్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం పై పోలీసులకు పిర్యాదు చెస్తే పైన పేర్కొన్న వారందరిపై కేసు నమోదు చేశారని తెలిపారు. నమ్మించి మోసం చేసి లేని భూమిని అంటగట్టిన ఈ మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని తన భూమి తనకు ఇప్పించాలని కోరారు.