Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
బషీరాబాద్ మండలంలో మైల్వార్ గ్రామంలో అంబే ద్కర్ విగ్రహం పెట్టనీయకుండా అడ్డుపడుతున్న వ్యక్తులపై కేసు నమోదు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కే.శ్రీనివాస్ మైనార్టీ హక్కుల జిల్లా అధ్యక్షులు చంద్రయ్య డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ మండలంలోని మై ల్వార్లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమ వారం అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి పునాది తీయడానికి పనులు చేస్తున్న ఎస్సీ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులపై మైల్వర్ స ర్పంచ్ భర్త ఖలీద్ అనుచరులు బూతులు తిడుతూ కులం పేరుతో దూషించరాని వారిపైచట్టపరంగా చర్యలు తీసు కోవాలని వారు డిమాండ్ చేశారు. నేటికీ గ్రామాల్లో కుల వివక్షత అంటారనితనం కొనసాగడం సిగ్గుచేటన్నా రు. అంబేద్కర్ విగ్రహాలను పెట్టకుండా అడ్డుపడుతూ అవ మాన పరుస్తూ గ్రామ సర్పంచి భర్త ఖలీద,్ పంచాయతీ సెక్రటరీ నర్సింలుగౌడ్ వారి అనుచరులపై ఎస్సీ, ఎస్టీ కే సు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తాండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మహనీ యుల విగ్రహాలు ఇప్పించడం అభినందనీయమే కానీ గ్రా మాల్లో నడిబొడ్డున ఏర్పాటు చేసే విధంగా లేదా మెయిన్ చౌరస్తాలలో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసే విధంగా మండల అధికారులకు పంచాయతీ అధికారులకు ఆదేశిం చాలని వారు డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని పె ట్టనీయకుండా అవమాన పరుస్తున్న వారందరిపై చర్య తీసుకోవాలని మంగళవారం ఎమ్మార్వో వెంకటస్వామి, ఎస్ఐ విద్యా చరణ్ రెడ్డికి ఫిర్యాదు చేశారని అదే స్థలంలో విగ్రహం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. సీఐటీయూ కేవీపీఎస్ ఎమ్మార్పీఎస్ ఎస్సీ, ఎసీ,్ట బీసీ మైనార్టీ హక్కుల ప్రజాసంఘాలు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆర్డిఓ, డిఎస్పి కార్యాల యం ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మెస్పీ మండల ఇన్చార్జి కృష్ణ, ఎస్టి మైనార్టీ హక్కుల జిల్లా అధ్యక్షులు చంద్రయ్య, కెేవీపీఎస్ మండల అధ్యక్షులు సురేష్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు అం బదాస్, మోహన్, వెంకట్, దేవప్ప, శ్రీకాంత్, వెంకటేష్, కా శప్ప, పాల్గొన్నారు.