Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
- నార్సింగ్‌లో కంటి పరీక్ష కేంద్రం ప్రారంభం
నవతెలంగాణ-గండిపేట్
సమాజ అభివృద్ధిలో భాగంగా పేదలకు లాభాపేక్ష కా కుండా పేదలకు నాణ్యమైన కంటి పరీక్షలను నిర్వహిం చాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. శుక్రవారం నార్సింగిలో స్థానిక ఎమ్మెల్యే ప్రకా శ్గౌడ్తో కలిసి శంకర్ ఐ కంటి పరీక్ష కేంద్రాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల పేదలకు నాణ్యమైన కంటి పరీక్షలు చేయాలన్నారు. శంకర్ ఐ ఆస్పత్రులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ మొత్తం 12 ఐ హాస్పిటల్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నార్సింగ్ పాలకవర్గ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఐ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.