Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్చి ఫాదర్ టీ.జూలియన్ రెడ్డి
నవతెలంగాణ-శంషాబాద్
ఏసుక్రీస్తు శిలువ వేసిన దినం త్యాగానికి గుర్తుగా గొప్ప సందేశం ఇచ్చే గుడ్ ఫ్రైడే వేడుకలు శంషాబాద్‌లోని వెల్లంకినినగర్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ టీ.జూలియన్రెడ్డి మాట్లాడుతూ త్యాగం, ప్రేమ , దయా ,సేవాగుణం ఏసుక్రీస్తు జీవిత చరిత్ర వలన తెలుస్తాయని అన్నారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలను శంషాబాద్‌లోని వైలంకిని నగర్ లో 'యేసు శిలువ' ప్రదర్శనను నిర్వహించారు. శిలువను మోస్తూ తీవ్ర చిత్ర హింసలకు గురవుతున్న ఏసుక్రీస్తు వేషధారణలో తుమ్మ సంపత్‌రెడ్డి అద్భుతంగా నటించారు. 2000 సంవత్సరాల క్రితం సమస్త మానవాళి కోసం ఏసుక్రీస్తు చేసిన త్యాగాన్ని రక్త తర్పణను కళ్లకు కట్టినట్టుగా చూపించడంతో అక్కడ దృశ్య రూపాన్ని తిలకించిన ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలింపజేసింది. ఏసుక్రీస్తు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సేవాదయ గుణంతో సమాజానికి ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు.