Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్
నవతెలంగాణ-షాద్ నగర్
బీఆర్ఎస్ ఓడిపోతుందనీ భయంతోనే ఆత్మీయ సమ్మేళనలు ఏర్పాటు చేస్తుందని షాద్ నగర్ గడ్డపై ఎన్ని కుతంత్రాలు పన్నిన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం ఫరూఖ్ నగర్ మండలంలోని వాచ్యాతండా, కర్ణకుంటతండా, మేక్యం గుట్ట తండా, గుట్ట వెంకితండాల నుంచి పెద్ద ఎత్తున వివిధ పార్టీలకు చెందిన 270 మంది కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వీర్లపల్లి శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ప్రభుత్వం పూర్తిగా నెరవేర్చలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని భయపడి అధిష్టానం నియోజకవర్గాలకు నిధులు సమకూర్చిందని ఆ డబ్బులతోనే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు చేపడుతుందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ హయాంలోనే గిరిజనులకు పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందన్నారు. గిరిజనులకు పక్కా ఇండ్లు, భూములు, రిజర్వేషన్లు ఇతరత్రా సౌకర్యాలు సమకూరాయని అన్నారు. నేడు తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా చేసి,కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని దుయ్యబట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. రైతు భరోసా కిందట భూమి లేని, కౌలు రైతులకు ఏడాదికి రూ. 15వేల పెట్టుబడి సాయం అందిస్తామనీ, ఉపాధి హామీలో భాగంగా నమోదు చేసుకున్న రైతు కూలీలకు రూ. 12వేల ఆర్థిక సాయం, పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చి, చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని హామీనిచ్చారు. ఈ కార్య క్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజుగౌడ్, ఐ ఎన్టీ యూసీ రఘు, కొందుర్గు మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, చౌదరిగుడా మండల అధ్యక్షులు రాజు, ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ, కుమారస్వామి గౌడ్, జాకారం శేఖర్, రూప్ సింగ్, తుపాకుల శేఖర్, అంజి యాదవ్, బుడ్డ నరసింహ, సుద ర్శన్, గంగ ముని సత్తయ్య, పురుషోత్తం రెడ్డి, రైకల్ శ్రీనివాస్,శీను నాయక్, ముబారక్ అలీ ఖాన్, కొత్తూరు నర్సింలు, నెహ్రు నాయక్, మల్లారెడ్డి, పుల్లారెడ్డి, గణేష్ రాథోడ్, గోపి నాయక్, రాజు నాయక్, సీతారాం, అశోక్, తీగాపూర్ ఆంజనేయులు, బాలరాజ్ పాల్గొన్నారు.