Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ మండలాధ్యక్షులు వేంకట్ రావు, వెంకట్ రెడ్డి, వీరన్న
నవతెలంగాణ-కొడంగల్
ప్రజలను మోసం చేసేందుకే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని, రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలివ్వని కేసీఆర్ దేశాన్ని ఉద్ధరిస్తాననడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేంకట్ రావు, బోడి వెంకట్ రెడ్డి, వీరన్నలు అన్నారు. సోమవారం మండల పరిధిలోని సుల్తాన్పూర్, గుండెపల్లి గ్రామాల్లో 'హాత్ సే హాత్ జోడో' యాత్ర ఇంటిం టికీ తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పథకాల అమలు చేస్తుందని ప్రజలకు వివరించారు. గుండెపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, విజయరావుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ మండల నాయకులు ముందుగా ప్రజలు ఎదుర్కొంటున సమస్యలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథాచేసి, రూ.లక్షల కోట్ల అప్పు తెస్తూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పాల కులు ప్రజలపై అప్పుల భారాన్ని మోపుతున్నారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదన్నారు. ఫించన్‌దారులకు ఇచ్చేందుకు డబ్బుల్లేక రాష్ట్రంలో పాలన అల్లకోలాలంగా మారుతుంటే సీఎం పట్టించుకోకపోవడం సరైన విధానం కాదన్నారు. రానున్న ఎన్నికల్లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. ఏకకా లంలోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. 57 ఏండ్లు నిండిన ప్రతీ పేదకు ఫించన్లు మంజూరు చేస్తా మన్నారు. రైతులు, కౌలుదారులకు ఏటా ఎకరానికి పంట పెట్టుబడికి రూ.15వేల చొప్పున సాయం అందజేస్తా మన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనని ప్రజలను మోసం చేసేందుకే ఒకరిపై ఒకరు దూషించు కుంటున్నారన్నారు. ఎన్ని ఎత్తుగడలు వేసినా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, బీజేపీలను నమ్మే పరిస్థితి లేదని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణ, అంజి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.