Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిడుగు పడి కాలిపోయిన కొబ్బరి చెట్టు
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయం త్రం భారీ వర్షం కురిసింది. రాజేంద్రన గర్ డీసీసీ కార్యాలయం పిడుగుపడి కొబ్బరి చెట్టు కాలిపోయింది. ఆ సమ యంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా పిడుగు పడటంతో ఆ ప్రాంతాల్లో భారీ శబ్దాలు రావడం అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీ సులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక భారీ వర్షానికి ఆరంగర్, ఉప్పరపల్లి ప్రధాన రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి. దీంతో అక్కడ వా హనాలు కొద్దిసేపు రోడ్డుపై నిలిచి పోయాయి. సుమారు గంట పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ప్రధాన రహ దారుల్లో వర్షపు నీరు పోవడానికి సరై న పైప్లైన్ లేకపోవడంతో వర్షం వస్తే ఆ ప్రాంతం గుండా ప్రయాణించ డా నికి వాహనదారులు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా జిహెచ్ఎంసి అధికా రులు స్పందించి రోడ్డుపై వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.