Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొయినాబాద్
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం సురం గల్కు చెందిన ఆలిండియా అంబేద్కర్ యువజన సం ఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బేగరి రాజు ఎంపి కయ్యారు. అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా హైదరాబాదులో రవీంద్ర భారతిలో శుక్రవారం ప్రతి ఏ టా అంబేద్కర్, మహానీయుల జయంతి ఉత్సవాల సం దర్భంగా దళిత సామాజిక ఉద్యమాలలో పనిచేస్తున్నటు వంటి నాయకులకు ప్రభుత్వం ఏటా అవార్డులు ప్రదా నం చేస్తుంది. ఈ ఏడాది రంగారెడ్డి జిల్లా మొయినా బాద్ మండలం సురంగల్కు చెందిన ఆలిండియా అం బేద్కర్ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షు డు బేగరి రాజుకు హైదరాబాద్ జయంతి ఉత్సవాల క మిటీ చైర్మన్ జంగా శ్రీనివాస్ దళిత రత్న అవార్డు ఎపిం క చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత బేగరి రాజు మాట్లాడుతూ సమ సమాజ నిర్మాణంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్ల్ల ఆశయాల కోసం పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. కార్యక్రమంలో ఆలిండియా అంబేద్కర్ యువజన సం ఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కడారం వినరుకు మార్, ఆలిండియా అంబేద్కర్ యువ సంఘం రంగా రెడ్డి జిల్లా అధ్యక్షులు బేగరి ప్రభాకర్, మల్లెపల్లి శ్రీనివాస్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.