Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ, కాంగ్రెస్ నాయకులు
- హాస్టల్‌ను సందర్శించిన ఎంపీపీ, జడ్పీటీసీ
నవతెలంగాణ-నవాబ్‌పేట్
ప్రభుత్వ బీసీ సంక్షేమ హాస్టల్ వార్డెన్, వాచ్మె న్ను సస్పెండ్ చేయాలని బీజేపీ, కాంగ్రెస్ నాయకు లు కోరారు. మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థులను వార్డెన్, వాచ్మెన్ చితకబాదిన ఘటన తెలుసుకున్న ఎంపీపీ కాలే భవాని శనివారం జడ్పీటీసీ కాలే జయమ్మతో కలిసి హాస్టల్‌ను సంద ర్శించి విద్యార్థులను కొట్టడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. భోజన వసతులను తాగునీటి సౌక ర్యాన్ని ఎలా కల్పిస్తున్నారని విద్యార్థులతో మాట్లాడా రు. జిల్లా అధికారికి ఫోన్ చేసి మాట్లాడి ఇంత జరి గిన మండలాన్ని ఎందుకు సందర్శించలేదని మండి పడ్డారు. విద్యార్థులను చితకబడిన ఘటన 'మీ దష్టి కి రాలేదా అని అడగగా తెలిసిందని' అ న్నారు. వారిపై చర్య తీసుకోవడానికి వ స్తున్నామని అధికారి సమాధానమివ్వగా సందర్శించకుండా ఎలా ఉన్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. హాస్టల్‌ను శనివా రం బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయ కులు సందర్శించి విద్యార్థులతో మాట్లా డారు. విద్యార్థులకు న్యాయం జరగాలని హాస్టల్ వార్డెన్, వాచ్మెన్ వెంటనే సస్పెండ్ చేయాలని వారు కోరారు. ఎంపీపీ, జడ్పీ టీసీ జయమ్మ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నాగిరెడ్డి, దాతపురం సర్పంచ్ బలవంత్ రెడ్డి, నాయకులు ప్రకాశం, కాంగ్రెస్ నాయకులు మేడిపల్లి వెంకటయ్య ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి చం ద్రకాంత్ శ్రీహరి గౌడ్ సారా జగన్ పాల్గొన్నారు.